Pan Card | పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్ PAN Card) కార్డు.. ప్రతి వ్యక్తి ఆర్థిక లావాదేవీలను వెల్లడిస్తుంది. దీన్ని ప్రతి పౌరుడికి ఆదాయం శాఖ కేటాయిస్తుంది. ప్రత్యేకించి ప్రతి పన్ను చెల్లింపుదారుడు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో స్పెషలైజ్డ్ 10 అంకెల అల్పా న్యూమరిక్ నంబర్‌తో కూడిన పాన్ కార్డును వాడాల్సిందే. పన్ను పరిధిలోకి రాని వేతనం.. ప్రొఫెషనల్ ఫీజులు, నిర్ధిష్ట పరిమితి దాటిన ఆస్తుల క్రయ, విక్రయాలు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు తదితర ఆర్థిక లావాదేవీలకు ఇది తప్పనిసరి. ఆధార్ లేదా రేషన్ కార్డు మాదిరే పాన్ కార్డు కూడా కీలక డాక్యుమెంట్లలో ఒకటి. పాన్ కార్డును పలు ట్రాన్సాక్షన్స్‌కు తప్పకుండా వాడాలి. ఎందుకో ఓ లుక్కేద్దామా..
ప్రత్యక్ష పన్నుల చెల్లింపులకు, ఐటీ రిటర్న్స్ పత్రాలు దాఖలు చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి. రూ.10 లక్షలు.. పైబడిన విలువ గల స్థిరాస్తుల క్రయ, విక్రయాలకు, వెహికల్స్ క్రయ, విక్రయ లావాదేవీలకు పాన్ కార్డు వాడాల్సిందే. ఒక హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లు రూ.50 వేలు దాటినా.. విదేశీ ప్రయాణానికి రూ.25 వేల కంటే ఎక్కువ ఖర్చు చేసినా ఈ నంబర్ వాడాల్సి ఉంటుంది.
ఆర్బీఐ జారీచేసే బాండ్ల కొనుగోలు లేదా.. ఏదేనీ కంపెనీ డిబెంచర్లు బాండ్ల కోసం రూ.50వేల పై చిలుకు ట్రాన్సాక్షన్స్‌కు, రూ.50 వేల కంటే ఎక్కువగా మ్యూచ్‌వల్ ఫండ్‌లో మదుపు చేసినా పాన్ కార్డు ఇవ్వాల్సిందే. ఒక బ్యాంకు ఖాతాలో రూ.50 వేలకు పైగా డిపాజిట్ చేస్తే, వస్తువుల క్రయ విక్రయాలు బిల్లు రూ.2 లక్షలు దాటినా పాన్ కార్డు వాడాల్సిందే.