మ్యూచువల్ ఫండ్ సిప్‌లతో కరోడ్‌పతి
(బిజినెస్ డెస్క్, నమస్తే తెలంగాణ)
‘డబ్బు డబ్బునే ఆకర్షిస్తుంది’.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వెళ్తున్నప్పుడు సాధారణంగా వినిపించే మాట ఇది. మ్యూచువల్ ఫండ్స్.. మదుపరులను కోటీశ్వరులనే చేస్తున్నాయి మరి. అయితే ప్రతి మార్కెట్ ఆధారిత పెట్టుబడి సాధనానికి ఉన్నట్టే.. మ్యూచువల్ ఫండ్స్‌కూ కొన్ని రిస్కులున్నాయి. ఈ ఒడిదుడుకులను తట్టుకునేటైట్టెతే కరోడ్‌పతి మీరే.
15X15X15 అంటే..
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకు వెళ్తే.. ఆకర్షణీయ లాభాలకు వీలు న్నది. ఈ క్రమంలోనే 15X15X15 అనేది ఉత్తమ పద్ధతిగా చెప్పుకోవచ్చు. పెట్టుబడి విలువ, కాలపరిమితి, ఆశించే రాబడులనే 15X15X15గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పరిగణిస్తున్నది. దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లోని పెట్టుబడులు చక్రవడ్డీలకు సమానంగా పెరిగి చిన్నచిన్న మొత్తాలు కాస్తా.. భారీ నిధిగా మారుతాయని నిపుణులు చెప్తున్నారు.
ఇదీ.. లెక్క
15 ఏండ్లపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.15,000 చొప్పున పెట్టుబడిగా పెడితే.. 15 శాతం వార్షిక రాబడులను అందుకోవచ్చు (15X15X15) అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా వచ్చిన మొత్తం కోటి రూపాయలపైనేనని అంచనా. ఈ మొత్తాన్ని అలాగే మరో 15 ఏండ్లు ఉంచితే రూ.10 కోట్ల నిధిని సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. నెలకు రూ.15,000 చొప్పున 15 ఏండ్లు (180 నెలలు) మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఆ మొత్తం రూ.27 లక్షలు అవుతున్నది. దీనిపై సుమారు రూ.74 లక్షల లాభం పొందవచ్చని వివరిస్తున్నారు. మొత్తంగా రూ.1.01 కోట్ల నిధి జమవుతున్నదని మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెప్తున్నాయి.