Hyderabad | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ హాట్కేక్ల ఎగురేసుకొని పోతున్నాయి కార్పొరేట్ సంస్థలు. అంతర్జాతీ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలానికి ఎనలేని గిరాకీ ఏర్పడిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫిల్డ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో హైదరాబాద్లో 24,43,523 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్థలం లీజుకు తీసుకున్నారని తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో తీసుకున్న 15,34,851 చదరపు అడుగులతో పోలిస్తే ఇది 59 శాతం అధికమని పేర్కొంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలానికి ఉన్న డిమాండ్ నివేదికను సంస్థ తాజాగా విడుదల చేసింది.
కార్పొరేట్ సంస్థల అడ్డగా వెలుగొందుతున్న బెంగళూరు నగరం ప్రస్తుతం వెలవెలబోతున్నది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో ఆఫీస్ స్థలానికి డిమాండ్ 39 శాతం పడిపోయినట్టు కుష్మన్ అండ్ వెక్ఫీల్డ్ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం 36,39,339 చదరపు అడుగులు లీజుకు తీసుకోగా..గత త్రైమాసికంలో 22,13,654 చదరపు అడుగులకు పడిపోయినట్టు తెలిపింది.