Honor X50i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్.. తాజాగా ఎక్స్ సిరీస్ ఫోన్ `హానర్ ఎక్స్50ఐ (Honor X50i) మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతేడాది ఆవిష్కరించిన హానర్ ఎక్స్40ఐ అప్‌గ్రేడ్ వర్షనే హానర్ ఎక్స్50ఐ. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్సెట్తో వచ్చింది. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. నాలుగు రంగుల్లో అందుబాటులోకి వస్తున్నది. 6.7-అంగుళాల ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 100-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 35 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
హానర్ ఎక్స్50ఐ (Honor X50i) బేస్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ దాదాపు రూ.16,600 (చైనాలో చైనా యువాన్లు 1399)లకు లభిస్తుంది. టాప్ ఎండ్ 12జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల ఫోన్ దాదాపు రూ.20 వేలు (1699 చైనా యువాన్లు)లకు లభిస్తుంది. ప్రస్తుతం చైనాలో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంది. హానర్ మాల్ స్టోర్ నుంచి అప్రికొట్ ఫ్లవర్ ఫెదర్, మ్యాజిక్ నైట్ బ్లాక్, మో యుయింగ్, విల్లో వైండ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.
డ్యుయల్-సిమ్ హానర్ ఎక్స్50ఐ (Honor X50i) ఆండ్రాయిడ్ 13-బేస్డ్ మాజిక్ ఓఎస్7.1పై ఆధారపడి పని చేస్తుంది. 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1,080×2,388 పిక్సెల్స్) ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 90హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 19.9:9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. సెల్ఫీ ఫొటోల కోసం స్క్రీన్ సెంటర్ అలైన్డ్ హోల్ పంచ్ కటౌట్ ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది.
100-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/1.8 అపెర్చర్ లెన్స్‌తోపాటు హానర్ ఎక్స్50ఐ ఫోన్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ విత్ ఎఫ్/2.4 అపెర్చర్ లెన్స్ కెమెరా ఉంటుంది. కెమెరా యూనిట్ ఎల్ఈడీ ఫ్లాష్, 10ఎక్స్ డిజిటల్ జూమ్ కలిగి ఉంటది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా విత్ ఎఫ్/2.0 అపెర్చర్ లెన్స్‌తో వస్తున్నది.
హానర్ ఎక్స్50ఐ (Honor X50i) ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11ఎ/బీ/జీ/ఎన్/ఏసీ, బ్లూటూత్ 5, జీపీఎస్, ఏజీపీఎస్, బైదూ, గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అంబియెంట్ లైట్ సెన్సర్, కంపాస్, గ్రావిటీ సెన్సర్, ప్రాక్సిమిటీ లైట్ సెన్సర్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.