Honor Play 40C | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హానర్’ తాజాగా చైనా మార్కెట్లో తన హానర్ ప్లే 40 సిరీస్ ఫోన్ ‘హానర్ ప్లే 40సీ’ ఆవిష్కరించింది. మూడు విభిన్న రంగులు మ్యాజిక్ నైట్ బ్యాక్, ఇంక్ జాడ్ గ్రీన్, స్కై బ్లూ కలర్స్‌లో ఇది లభిస్తుంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 ఎస్వోసీ చిప్ సెట్, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో వస్తుంది. వర్చువల్‌గా మరో 5జీబీ రామ్ పెంచుకోవచ్చు. భారత్ మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తారో వెల్లడించలేదు.
హానర్ ప్లే 40సీ ఫోన్ 6.56- అంగుళాల ఎల్సీడీ (1612×720 పిక్సెల్స్ రిజొల్యూషన్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 7.1 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది. దీని ధర సుమారు రూ.10,300 (899 చైనా యువాన్లు) (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
హానర్ ప్లే 40సీ ఫోన్ 13-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ ఐడెంటిఫికేషన్ కోసం ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ఉంటుంది. దీంతోపాటు యాక్సిలో మీటర్, యాంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ కూడా ఉంటాయి.