Honor Magic 6 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హ్యువావే అనుబంధ హానర్ తన హానర్ మ్యాజిక్ 6 (Honor Magic 6) సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. హానర్ మ్యాజిక్ 6, హానర్ మ్యాజిక్ 6 ప్రోతోపాటు హానర్ మ్యాజిక్ వీ2 ఫోన్లు వచ్చేనెలలో మార్కెట్లోకి రానున్నాయి. వచ్చేనెల జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) సందర్భంగా ఈ ఫోన్లు ఆవిష్కరిస్తుంది. ఈ నెల ప్రారంభంలో చైనా మార్కెట్లో హానర్ మ్యాజిక్ 6, హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్లు ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 8.0 స్కిన్ వర్షన్‌పై పని చేస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఫిబ్రవరి 25 మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఫోన్లను ఆవిష్కరిస్తారు.
హానర్ మ్యాజిక్ 6 ఫోన్ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.50 వేలు (4399 చైనా యువాన్లు) పలుకుతుందని తెలుస్తున్నది. ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లేతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటుంది. 180 మెగా పిక్సెల్ పెరిస్కోప్ సెన్సర్ ప్రైమరీ ఫోన్ వస్తుంది. హానర్ మ్యాజిక్ 6 ఫోన్ 5450 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ, హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటాయి.
పొర్చే డిజైన్‌తో వస్తున్న హానర్ మ్యాజిక్ వీ2 ఆర్ఎస్ఆర్ స్పెషల్ వర్షన్ ఫోల్డబుల్ ఫోన్ పొర్చే అగేట్ గ్రే షేడ్ కలర్ లో వస్తుంది. 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్, 66 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 6.43 అంగుళాల కవర్ డిస్ ప్లే, 7.92 అంగుళాల ఇన్నర్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తోంది.