Honor Choice Watch : హానర్ ఎక్స్9బీ 5జీ, హానర్ ఛాయిస్ ఎక్స్5 టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్‌తో కలిపి హానర్ ఛాయిస్ వాచ్ భారత్‌లో గురువారం లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌వాచ్ రెక్టాంగ్యులర్ అమోల్డ్ డిస్ప్లే, మెటాలిక్ బాడీ, ఇంటర్‌ఛేంజబుల్ సిలికాన్ స్ట్రాప్స్‌తో ఆకట్టుకుంటుంది.
120 స్పోర్ట్స్ మోడ్స్, 100 వాచ్ ఫేస్‌లను సపోర్ట్ చేస్తూ రెండు కలర్ ఆప్షన్స్‌ను హానర్ ఛాయిస్ స్మార్ట్‌వాచ్ ఆఫర్ చేస్తోంది. ఈ వాచ్ మాగ్నెటిక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని ఈ హాట్ డివైజ్ 12 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని హానర్ పేర్కొంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభించే హానర్ ఛాయిస్ వాచ్ భారత్‌లో రూ. 6499కి లభిస్తుంది.
ప్రారంభ ఆఫర్‌గా రూ. 500 డిస్కౌంట్‌తో ఈ వాచ్ రూ. 5999కి అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 24 నుంచి ఈ వాచ్ అమెజాన్ ద్వారా కొనుగోలుదారులకు లభించనుంది. పలు ఆఫ్‌లైన్ స్టోర్స్, ఎక్స్లోర్హానర్.కాం వెబ్సైట్పైనా ఈ వాచ్ లభిస్తుంది.
Read More :