Redmi A3 | షియోమీ (Xiaomi) అనుబంధ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ ఏ3 (Redmi A3) ఫోన్‌ను బుధవారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ ప్లే, మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్నది. మూడు రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ మూడు ర్యామ్ + మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బ్యాక్ 8-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్, 10వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
న్యూ రెడ్మీ ఏ3 (Redmi A3) ఫోన్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,299, 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,299, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,299లకు లభిస్తుంది. మిడ్ నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలివ్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ డాట్ కామ్, షియోమీ రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం అవుతాయి. రెడ్మీ ఏ2 ఫోన్ 2 జీబీ ర్యామ్ విత్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్ గతేడాది మే నెలలో రూ.5,999లకు మార్కెట్లో ఆవిష్కరించింది.
రెడ్మీ ఏ3 ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఫోన్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.71-అంగుళాల హెచ్డీ+ (1600×700 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ తోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ హేలియో జీ36 ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది. 3జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్లో వర్చువల్‌గా 12 జీబీ వరకూ పొడిగించుకోవచ్చు.
ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ కెమెరా యూనిట్ సెటప్ ఉంటుంది. 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ -జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, గ్లోనాస్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, ఈ-కంపాస్, అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.