Honor 200 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన హానర్ 200 సిరీస్ (Honor 200 Series) ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఇందులో హానర్ 200 లైట్ 5జీ (Honor 200 Lite 5G), హానర్ 200 5జీ (Honor 200 5G), హానర్ 200 ప్రో 5జీ (Honor 200 Pro 5G) ఫోన్లు ఉన్నాయి. గత జూన్ లోనే గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్లను హానర్ ఆవిష్కరించింది. ఈ నెల 19 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఈ ఫోన్లను ఆవిష్కరించనున్నది. అమెజాన్, హానర్ వెబ్ సైట్, ఇతర ఆఫ్ లైన్ మెయిన్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుంది. సియాన్ లేక్, మిడ్ నైట్ బ్లాక్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.
హానర్ 200 లైట్ 5జీ (Honor 200 Lite 5G) ఫోన్ 108-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ‘సెల్ఫీ లైట్’ 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 8 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. అమోలెడ్ డిస్ ప్లే విత్ 3240 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ రేట్ కలిగి ఉంటుంది. హానర్ 200 లైట్ 5జీ ఫోన్ గ్లోబల్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ ప్రాసెసర్, 35వాట్ల వైర్డ్ సూపర్ చేంజ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ 279.99 పౌండ్లు (సుమారు రూ.29,900) పలుకుతుంది.