Honor 200 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ తన హానర్ 200 లైట్ 5జీ ఫోన్ ను ఈ నెల 19న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇప్పటికే గత జూన్ నెలలో గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరించారు. జూలైలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్లతో జత కలువనున్నది. అమెజాన్ ద్వారా హానర్ 200 లైట్ 5జీ ఫోన్ల విక్రయాలు జరుగుతాయి.
హానర్ 200 లైట్ 5జీ ఫోన్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 1200 నిట్స్ హై బ్రైట్ నెస్ మోడ్ కలిగి ఉంటుంది. ఈ-బుక్, డార్క్ మోడ్ లకు స్క్రీన్ మద్దతుగా ఉంటుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తున్న ఈ ఫోన్ లో ర్యామ్ వర్చువల్ గా అదనంగా 8 జీబీ పెంచుకోవచ్చు. సియాన్ లేక్, మిడ్ నైట్ బ్లాక్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ షూటర్, 2 మెగా పిక్సెల్ మైక్రో షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమరా ఉంటాయి.
హానర్ 200 లైట్ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 8 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. హానర్ 200 లైట్ 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.29,900 (279.99 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు) పలుకుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ ప్రాసెసర్, 35వాట్ల వైర్డ్ సూపర్ చార్జర్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 6.7 అంగుళాల స్క్రీన్, సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది.