Honor 200 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ తన హానర్ 200 5జీ (Honor 200 5G) సిరీస్ ఫోన్లను ఈ నెల 18న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. హానర్ 200 5జీ తోపాటు హానర్ 200 ప్రో 5జీ ఫోన్ కూడా ఆవిష్కరిస్తారు. రెండు ఫోన్లలోనూ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. పారిస్ బేస్డ్ పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ స్టూడియో ‘స్టూడియో హర్ కౌంట్’ ఏఐ పోర్టైట్ ఇంజిన్’ను డెవలప్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హానర్ మ్యాజిక్ ఓఎస్ 8.0 స్కిన్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.
హానర్ 200 ప్రో 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ హెచ్9000 పోర్ట్రైట్ మెయిన్ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 856 టెలిఫోటో కెమెరా విత్ 2.5 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ మాక్రో కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) కలిగిఉంటాయి. రెండు ఫోన్లలోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా కలిగి ఉంటాయి. ఫ్రంట్, రేర్ కమెరాలు 4కే వీడియో రికార్డింగ్ కు మద్దతుగా ఉంటాయి. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ వీడియో మోడ్.. హై క్వాలిటీ వీడియోలు అందిస్తుంది.
హానర్ 200 5జీ ఫోన్ 50మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 906 సెన్సర్ విత్ ఓఐఎస్, 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 856 టెలిఫోటో లెన్స్ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్లలో విభిన్న లైటింగ్ ఎఫెక్టులతో హార్ కౌంట్ వైబ్రంట్, హర్ కౌంట్ కలర్, హర్ కౌంట్ క్లాసిక్ కలిగి ఉంటాయి. ఏఐ పవర్డ్ నైట్ పోర్టైట్ మోడ్ వల్ల లో లైట్ కండీషన్లలోనూ డిటైల్డ్ పోర్ట్రైట్స్, బ్యాక్ గ్రౌండ్స్ ఉంటాయి.