Honor | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ తన హానర్ 200 5జీ, హానర్ 200 5జీ ప్రో ఫోన్లను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు ఫోన్లలోనూ 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 8.0 వర్షన్ పై పని చేస్తాయి. 100 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. హానర్ 200 5జీ ప్రో ఫోన్ లో సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం డ్యుయల్ కెమెరాలు ఉండటంతోపాటు వైర్ లెస్ చార్జింగ్ మద్దతు ఉంటుంది.
హానర్ 200 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.34,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.39,999 పలుకుతుంది. హానర్ 200 5జీ ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.57,999 పలుకుతుంది. హానర్ 200 5జీ ఫోన్ బ్లాక్, మూన్ లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో, హానర్ 200ప్రో 5జీ ఫోన్ బ్లాక్, ఓషన్ షియాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటలకు హానర్ ఇండియా వెబ్ సైట్, అమెజాన్, సెలెక్టెడ్ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
ఈ నెల 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్లో భాగంగా హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది హానర్. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.3000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని కండీషనల్ ఆఫర్లపై రూ.8000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ తో కలిపి రూ.8,499 విలువైన హానర్ యాక్సెసరీస్ ఫ్రీగా లభిస్తాయి.
హానర్ 200 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 4000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ కర్వ్డ్ డిస్ ప్లే ఉంటుంది. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ 6.78 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. హానర్ 200 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్లతో పని చేస్తాయి.
హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్లు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా, 12 -మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్ కలిగి ఉంటాయి. హానర్ 200 5జీ ఫోన్ లో సోనీ ఐఎంఎక్స్906 మెయిన్ సెన్సర్ కెమెరా, హానర్ 200 ప్రో 5జీ ఫోన్ హెచ్9000 ప్రైమరీ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం రెండు ఫోన్లలోనూ 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ లో అదనంగా 3డీ డెప్త్ కెమెరా కూడా ఉంటుంది.
హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లు రెండూ 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ 66వాట్ల వైర్ లెస్ చార్జింగ్, రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతు కలిగి ఉంటుంది. వై-ఫై, బ్లూటూత్-5.3, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి.