న్యూఢిల్లీ, డిసెంబర్ 20: వచ్చే నెల నుంచి వాహన ధరలను 2 శాతం వరకు పెంచబోతున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రకటించింది.
ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు లాజిస్టిక్ ఖర్చులు అధికమవడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కునల్ బెహ్ల తెలిపారు. ప్రస్తుతం సంస్థ అమేజ్, సిటీ, ఎలివేట్ మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.