న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా..2025 ఏడాదికిగాను సరికొత్త యాక్టివాను పరిచయం చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ యాక్టివా స్కూటర్ రూ.94,422, రూ.97,146 ధరతో లభించనున్నాయి.
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. అడ్వాన్స్ ఫీచర్స్ టీఎఫ్టీ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నది. 123.92 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన సింగిల్-సిలిండర్‌తో తయారు చేసింది. ఈ సందర్భంగా హోండా మోటర్‌సైకిల్ ఎండీ, సీఈవో త్సుత్సుము ఒటానీ మాట్లాడుతూ..వినియోగదారులు అభిరుచికి తగ్గట్టుగా యాక్టివా అప్డేటెడ్ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.