హైదరాబాద్, నవంబర్ 20: ప్రీమియం కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఎలివేట్ ఏడీవీ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రెండు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.15.29 లక్షలుగాను, గరిష్ఠంగా రూ.16.66 లక్షలుగా నిర్ణయించింది.