ముంబై, మార్చి 15: దేశీయ మార్కెట్‌కు నయా షైన్‌ను పరిచయం చేసింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. 100సీసీ కలిగిన షైన్ 100 మోటర్‌సైకిల్ ప్రారంభ ఆఫర్ కింద ధరను రూ.64,999గా నిర్ణయించింది. ఈ ధరలు మహారాష్ట్ర షోరూంనకు సంబంధించినవి.
దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ద్విచక్రవాహనాల్లో మూడోవంతు 100సీసీ సెగ్మెంట్‌కు చెందినవి కావడంతో ఈ నయా బైకును లాంచ్ చేసినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అత్సుషి ఒగాటా తెలిపారు.