Honda Cars Discounts | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఈ నెలలో తన కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నది. క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్, లాయాల్టీ బోనస్, కార్పొరేట్ ఆఫర్ తదితర రూపాల్లో అత్యధికంగా రూ.27,500 వరకు రాయితీ లభించనున్నది. హోండా సిటీ, అమేజ్ సెడాన్, జాజ్ హ్యాచ్‌బ్యాక్, డబ్ల్యూ-ఆర్ ఎస్యూవీ తదితర మోడల్ కార్లపై ఈ ఆఫర్ అందిస్తున్నది. ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చిన సిటీ ఈ-హెచ్ఈవీ హైబ్రీడ్ సెడాన్‌పై రాయితీలు ప్రకటించలేదు. ఈ నెలాఖరు వరకు రాయితీలు అమల్లో ఉంటాయి.
హోండా మిడ్‌సైజ్ సెడాన్ సిటీ ఫిఫ్త్ జనరేషన్ కారుపై అత్యధికంగా రూ.27, 496 డిస్కౌంట్ లభిస్తుంది. రూ.5000 వరకు క్యాష్ డిస్కౌంట్ / రూ.5,466 వరకు విడి భాగాలు ఫ్రీ, కారు ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూ.5000 పొందొచ్చు. అదనంగా కస్టమర్లకు లాయాల్టీ బోనస్ రూ.5000, ఎక్స్చేంజ్ బోనస్ రూ.7000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5000 అందిస్తున్నది.
జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా సబ్-కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ `డబ్ల్యూఆర్-వీ`పై గరిష్ఠంగా రూ.27 వేల రాయితీలు లభిస్తాయి. కారు ఎక్స్చేంజ్కింద రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.5000, పాత కస్టమర్లకు లాయాల్టీ బోనస్ రూపంలో రూ.5000, ఇతరులకు ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.7000 డిస్కౌంట్ అందిస్తున్నది.
హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు హోండా జాజ్‌పై అత్యధికంగా రూ.25 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.10 వేలు, లాయాల్టీ బోనస్‌గా రూ.5000, ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.7,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో రూ.3000 రాయితీ పొందొచ్చు.
సబ్-కంపాక్ట్ సెడాన్ మోడల్ కారు అమేజ్‌పై రూ.8000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. హోండా కస్టమర్లకు లాయాల్టీ బోనస్ రూ.5000తోపాటు ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.3000 వరకు లభిస్తుంది.
హోండా ఫ్లాగ్షిప్ సెడాన్ వేరియంట్ సిటీ ఫోర్త్ జనరేషన్ కారుపై రూ.5000 లాయాల్టీ బోనస్ మాత్రమే అందిస్తుంది. ఇతర రాయితీలు ఉండవని హోండా కార్స్ తెలిపింది.