న్యూఢిల్లీ: హోండా కార్ ఇండియా ( Honda cars ) పండుగల సీజన్లో కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా ఒక మోడల్‌పై రూ.57,044 వరకూ డిస్కౌంట్ ఇవ్వనుంది. అమేజ్, జాజ్, సిటీ, డబ్ల్యూఆర్-వీ మోడల్స్‌పై ఈ డిస్కౌంట్లు ఉంటాయి. ఈ నెల 30 వరకూ లేదంటే స్టాక్ ఉన్నంత వరకూ ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అత్యధికంగా హోండా అమేజ్ పాత మోడల్‌పై రూ.57,044 డిస్కౌంట్ ఇస్తోంది.
ఎస్ఎంటీ పెట్రోల్ మోడల్‌పై రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.24,044 యాక్సెసరీస్ ఉచితంగా ఇవ్వడంతోపాటు కార్ ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు ఇవ్వనున్నారు. ఇక అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై గరిష్ఠంగా రూ.18 వేల వరకూ డిస్కౌంట్ ఉంది. ఇక హోండా జాజ్‌పై రూ.39,947 వరకూ, హోండా డబ్ల్యూఆర్-వీపై గరిష్ఠంగా రూ.39,998 వరకూ, ఐదో జనరేషన్ హోండా సిటీపై రూ.37,708 వరకూ, డిస్కౌంట్లు ప్రకటించింది హోండా ఇండియా.