Honda Activa | ప్రముఖ టూవీలర్స్ తయారీ సంస్థ – హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన అత్యంత పాపులర్ మోడల్ స్కూటర్ `యాక్టివా`.. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. కారు తరహాలో కీ లెస్ ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ విత్ యాంటీ థెఫ్ట్ సిస్టమ్‌తో కూడిన ఫీచర్‌తో వస్తుందీ స్కూటర్.
డీలక్స్, స్మార్ట్ వేరియంట్లలో మార్కెట్లో ప్రవేశ పెట్టింది. వీటి ధర రూ.80,734 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. బుకింగ్స్ ప్రారంభమైనా.. హోండా రెడ్ వింగ్ డీలర్ల వద్ద లిమిటెడ్ టైం మాత్రమే లభిస్తాయి.
పదేండ్ల వారంటీ (మూడేండ్లు స్టాండర్డ్, ఏడేండ్లు ఆప్షనల్) ప్యాకేజీతో వస్తుందీ హోండా యాక్టీవా.. భారత్ మార్కెట్లో హీరో జూమ్, సుజుకి యాక్సెస్, టీవీఎస్ జూపిటర్ వంటి స్కూటర్లతో తల పడుతుంది. యాక్టీవా డీలక్స్ లిమిటెడ్ ఎడిషన్ రూ.80,734 (ఎక్స్ షోరూమ్), యాక్టీవా స్మార్ట్ లిమిటెడ్ ఎడిషన్ రూ.82,734 (ఎక్స్ షోరూమ్) లకు లభిస్తాయి.
బాడీ ప్యానెల్స్‌పై స్ట్రైప్ గ్రాఫిక్స్‌తో బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్స్, డార్క్ కలర్ థీమ్ ఫీచర్లు ఉంటాయి. రేర్ గ్రాబ్ రైల్పై బ్లాక్ క్రోమ్ గార్నిష్తోపాటు యాక్టీవా 3డీ లోగో, బాడీ కలర్ డార్క్ ఫినిష్‌తో వస్తుంది. మ్యాట్టె స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సిరెన్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫైవ్ -స్పోక్ అల్లాయ్ వీల్స్ తో వస్తున్నదీ స్కూటర్. టాప్ హై ఎండ్ వేరియంట్ హోండా స్మార్ట్ కీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నది.
హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ 109.51 సీసీ సింగిల్ సిలిండర్, న్యూ ఓబీడీ2 ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకోవడంతోపాటు ఎయిర్ కూల్డ్ ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7.73 బీహెచ్పీ విద్యుత్, 8.84 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ స్కూటర్ తో 10 శాతం మైలేజీ పెరుగుతుందని కంపెనీ తెలిపింది.