హైదరాబాద్, మార్చి 3: ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ హోలాండ్.. మార్కెట్లోకి నయా ట్రాక్టర్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న కిసాన్ అగ్రి వేదికగా 30 హెచ్‌పీ విభాగంలో రెండు మాడళ్లను పరిచయం చేసింది.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సరికొత్త ట్రాక్టర్లు బ్లూ సిరీస్, సింబా 30, 5620 పవర్ కింగ్-ట్రెమ్-6 రూపం లో లభించనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.