ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. తన జీఎల్ 1800 గోల్డ్ వింగ్ (GL1800 Gold Wing), సీబీఆర్ 1000 ఆర్ఆర్ (CBR1000RR) మోటారు సైకిళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్యుయల్ పంపుల్లో లోపం తనిఖీ చేసి రీప్లేస్ చేస్తామని హెచ్ఎంఎస్ఐ శుక్రవారం తెలిపింది.
2017 డిసెంబర్- 2023 డిసెంబర్ మధ్య తయారు చేసిన హోండా జీఎల్1800 గోల్డ్ వింగ్ (Honda GL1800 Gold Wing), 2017 సెప్టెంబర్ – 2020 ఏప్రిల్ మధ్య తయారు చేసిన సీబీఆర్1000 ఆర్ఆర్ (CBR1000RR) మోటార్ సైకిళ్లు రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే, వీటిలో ఎన్ని మోటారు సైకిళ్లను రీకాల్ చేస్తున్న సంగతి వెల్లడించింది.
`ఫ్యుయల్ ఇంపెల్లర్స్ సరిగ్గా మౌల్డ్ చేయకపోవచ్చు. దీనివల్ల ఫ్యుయల్ పంప్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. ఫ్యుయల్ పంప్ మాడ్యూల్ ఇన్ఆపరేటివ్ అయితే, ఇంజిన్ స్టార్ట్ కాకపోవచ్చు లేదా ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి సంకేతాల్లేకుండా మోటారు సైకిల్ నిలిచిపోవచ్చు` అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తెలిపింది. దేశవ్యాప్తంగా బిగ్ వింగ్ టాప్‌లైన్ డీలర్ల వద్ద ఫ్యుయల్ పంపులను తనిఖీ చేసి, రీప్లేస్ చేస్తామని వెల్లడించింది.