Hero Xtreme 160R 4V | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) మోటారు సైకిల్‌ను శనివారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీనిధర రూ.1.39 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1.40 లక్షలకు (ఎక్స్ షోరూమ్) పెరిగింది. మూడు కలర్ ఆప్షన్లతో హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V).. సింగిల్ ట్రిమ్ ఆప్షన్ ‘ప్రీమియం’ ఆప్షన్లో అందుబాటులో ఉంది. ఈ మోటారు సైకిల్ 163.2సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ విత్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 16.6 బీహెచ్పీ విద్యుత్, 14.6 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ,బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, యమహా ఎఫ్జడ్ఎస్ ఎఫ్ఐ వీ4, సుజుకి గిక్సర్ 155 మోటారు సైకిళ్లతో హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ మోటారు సైకిల్ పోటీ పడనున్నది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ (TVS Apachi RTR 160 4V) మోటారు సైకిల్ ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోటారు బైక్ ధర రూ.1.25 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1.30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలకుతుంది. 159.7సీసీ సింగిల్ సిలిండర్ విత్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తోంది. స్పోర్ట్ మోడ్‌లో ఈ ఇంజిన్ గరిష్టంగా 9250 ఆర్పీఎం వద్ద 17.3 బీహెచ్పీ విద్యుత్, 7250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. డబుల్ క్రెడిల్ ఫ్రేమ్, ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్ లో మోనోషాక్ కలిగి ఉంటుంది. డీఆర్ఎల్స్ తోపాటు హెడ్ ల్యాంప్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, హయ్యర్ వేరియంట్లలో స్మార్ట్ కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
అప్ డేటెడ్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 మోటారు సైకిల్ నాలుగు రంగులు, మూడు వేరియంటలలో లభిస్తుంది. దీని ధర రూ.1.46 లక్షల (ఎక్స్ షోరూమ్) ఫర్ సింగిల్ చానెల్ ఏబీఎస్ మోడల్ నుంచి రూ.1.85 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఫర్ బ్లూటూత్ వేరియంట్ పలుకుతుంది. ట్విన్ స్పార్క్ ఫోర్ -వాల్వ్ 160సీసీ ఇంజిన్ తో వస్తోందీ బైక్. ఈ ఇంజిన్ 17 బీహెచ్పీ విద్యుత్, 14.6 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. డ్యుయల్ చానెల్ ఏబీఎస్ తో రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఫ్రంట్ లో సస్పెండెడ్ యూఎస్డీ ఫోర్క్స్, రేర్ లో మోనోషాక్ జత చేశారు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతోపాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
యమహా ఎఫ్జడ్ఎస్ ఎఫ్ఐ వీ4 మోటారు సైకిల్ రెండు వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మోటారు సైకిల్ ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్, 149సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ విత్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సుతో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7250 ఆర్పీఎం వద్ద 12 బీహెచ్పీ విద్యుత్, 5,500 ఆర్పీఎం వద్ద 13.3 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సింగిల్ చానెల్ ఏబీఎస్ తోపాటు సింగిల్ డిస్క్స్ జత చేశారు. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్ లో మోనోషాక్ ఫీచర్లు ఉంటాయి. ఎల్ఈడీ హెడ్, టెయిల్ లైట్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎల్ సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ కలిగి ఉంటుంది.
సుజుకి గిక్సర్ 155 మోటారు సైకిల్ సింగిల్ సిలిండర్, ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సుతోపాటు ఎయిర్ కూల్డ్ 155సీసీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8000 ఆర్పీఎం వద్ద 13.4 బీహెచ్పీ, 6000 ఆర్పీఎం వద్ద 13.8 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఏబీఎస్ ఆల్ అరౌండ్ అండ్ రైడ్స్ ఆన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఇన్ ఫ్రంట్, రేర్ స్వింగ్ ఆర్మ్ కలిగి ఉంటుంది. బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ కన్సోల్, టర్న్ బై టర్న్ నేవిగేషన్ విత్ ఈటీఏ అండ్ ఎస్ఎంఎస్ / కాల్ అలర్ట్స్ అందిస్తుంది. స్టాండర్డ్ ఎడిషన్ గిక్స్ మోటారు సైకిల్ ధర రూ.1.34 లక్షలు (ఎక్స్ షోరూమ్), రైడ్ కనెక్ట్ ఎడిషన్ రూ.1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతాయి.