Hero Passion+ 2023 | ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ హీరో మోటో కార్ప్.. దేశీయ మార్కెట్లోకి హీరో పాషన్ + 2023 (Hero Passion+ 2023) మోటారు సైకిల్ తీసుకొచ్చింది. ఈ బైక్ మూడు కలర్స్ స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్, బ్లాక్ విత్ నెక్సస్ బ్లూ, బ్యాక్ విత్ హెవీ గ్రే ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ.76,301 గా నిర్ణయించారు.
హీరో పాషన్ +2023 (Hero Passion+ 2023) ఓబీడీ-2 అండ్ బీఎస్-6, కంప్లియెంట్ 100 సీసీ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8000 ఆర్పీఎం వద్ద 8.02 పీఎస్ విద్యుత్, 6000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ బేస్డ్ మోటార్ సైకిల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ట్విన్ షాక్స్ @ రేర్, ట్యూబ్ లెస్ టైర్లతో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ మొబైల్ చార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, స్పీడో మీటర్, ట్రిప్ మీటర్, ఒడో మీటర్, ఫ్యుయల్ గాజ్, హెడ్ లైట్ ఇండికేటర్లు, టర్న్ ఇండికేటర్లు, స్టయిలిష్ లివరీ, హ్యాండిల్‌పై క్రోమ్ ఫినిష్, మఫ్లర్ కవర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ బెటర్ ఫ్యుయల్ ఎఫిషియెన్సీ కోసం ఐ3ఎస్ టెక్నాలజీతో వస్తున్నది.