న్యూఢిల్లీ, జూలై 18: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..మార్కెట్లోకి ర్యాలీ ఎడిషన్‌గా 200 సీసీ కెపాసిటీ కలిగిన ఎక్స్‌పల్స్ 200 4వీని పరిచయం చేసింది. ఢిల్లీ షోరూంలో ఈ బైకు ధర రూ.1.52 లక్షలుగా నిర్ణయించింది. ర్యాలీ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ బైకు ఈ నెల 22 మధ్యాహ్నాం 12 గంటల నుంచి 29న మధ్యాహ్నాం 12 గంటల వరకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. 200 సీసీ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైకు 18.9 బీహెచ్‌పీల శక్తినివ్వనున్నది.