Hero Xtreme 160R 4V | దేశంలోకెల్లా అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ (Hero MotoCorp) మార్కెట్లోకి ఆల్-న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 160 ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) మోటారు సైకిల్ ఆవిష్కరించింది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,27,300గా నిర్ణయించారు. గురువారం నుంచి బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూలై రెండో వారం నుంచి కస్టమర్లకు డెలివరీ ప్రారంభిస్తారు.
హీరో 160ఆర్ 4వీ బైక్ మూడు వేరియంట్లు – `స్టాండర్డ్ (Standard), కనెక్టెడ్ (Connected), ప్రో (Pro)`ల్లో లభిస్తుంది.బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160), టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ (TVS Apache RTR 160 4V), బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 (Bajaj Pulsar NS160) బైక్‌లకు హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) గట్టి పోటీ ఇవ్వనున్నది.
స్టాండర్డ్ – రూ.1,27,300
కనెక్టెడ్ – రూ.1,32, 800
ప్రో – రూ.1,36,500
హీరో 160ఆర్ 4వీ మోటార్ సైకిల్ 163 సీసీ 4 -వాల్వ్ ఆయిల్ -కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్నది. గరిష్టంగా 16.9 పీఎస్ విద్యుత్ వెలువరిస్తుంది. యూఎస్డీ ఫోర్స్ కూడా ఉంటుంది. అత్యంత ఆధునిక టెలిమాటిక్స్‌తో శరవేగంగా దూసుకెళ్లే సామర్థ్యం గల లైటెస్ట్ 160సీసీ మోటారు సైకిల్ ఇది.
17-అంగుళాల అల్లాయ్ వీల్స్ రాప్డ్ విత్ 100/80 ట్యూబ్ లెస్ టైర్స్ ఇన్ ఫ్రంట్, 130/70 ట్యూబ్ లెస్ టైర్స్ రేర్, షార్పర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ విత్ డేటైం రన్నింగ్ లైట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. మూడు రంగులు – మ్యాట్టే స్లేట్ బ్లాక్, నియాన్ నైట్ స్టార్, బ్లాజింగ్ స్పోర్ట్స్ రెడ్ కలర్స్‌లో లభిస్తుంది.