Innovaccer Layoffs | హెల్త్‌కేర్ స్టార్టప్ `ఇన్నోవాస్సర్` దాదాపు 245 మంది ఉద్యోగుల (దాదాపు 15 శాతం) ను తొలగించినట్లు తెలుస్తున్నది. భారత్‌తోపాటు అమెరికాలో పని చేస్తున్న టీమ్‌ల నుంచి వారిని ఇంటికి సాగనంపినట్లు మంగళవారం మీడియాలో వార్తలొచ్చాయి. గత ఐదు నెలల్లో ఇన్నోవాస్సర్లో ఉద్యోగులను తొలగించడం ఇది రెండో సారి.
సూక్ష్మ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగులను తొలగించక తప్పలేదని ఇన్నోవాస్సర్ సీఈవో, కో-ఫౌండర్ అభినవ్ శశాంక్ తెలిపారు. ఈ మేరకు ఇన్నోవాస్సర్ తమ ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ ఈ-మెయిల్ ఆధారంగా లీడింగ్ స్టార్టప్ న్యూస్ పోర్టల్ ఇంక్42 ఓ వార్తా కథనం ప్రచురించింది.
`ఇన్నోవాస్సర్ ఎల్లవేళలా తన కస్టమర్లకు సాధికారత కల్పించాలని నమ్ముతుంది. రోగులు, ప్రజలకు అత్యున్నత నాణ్యతతో కూడిన కేర్ అందించాలని భావిస్తున్నది` అని అభినవ్ శశాంక్ తన ఇంటర్నల్ ఈ-మెయిల్లో తెలిపారు. అయితే ఉద్వాసనకు గురైన సిబ్బందికి సీవరెన్స్ ప్యాకేజీలు, ట్రాన్సిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్లు, జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అందిస్తున్నది. ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తున్నదన్న భయాల మధ్యే రెండోసారి ఉద్యోగులను తొలగించింది. గత సెప్టెంబర్‌లోనూ దాదాపు 120 మందికి పింక్ స్లిప్‌లు అందజేసింది.