Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థలు రూ.2,28,690 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.99,835.27 కోట్ల ఎం-క్యాప్ నష్టపోయింది. తర్వాతీ స్థానంలో రిలయన్స్ రూ.71,715.6 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. అయినా ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. టాప్-3లోనే కొనసాగుతున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ నష్టాలతో సరిపెట్టుకున్నాయి. టాప్-10 సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మాత్రమే లాభాలు పొందాయి. టీసీఎస్ రూ.1,024.53 కోట్లు, హెచ్యూఎల్ రూ.2,913.49 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి.
గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1829 పాయింట్లు (సుమారు 2.7శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 518 పాయింట్లు (దాదాపు 2.60 శాతం) నష్టాలతో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ దాదాపు ఎనిమిది శాతం, రిలయన్స్ షేర్ నాలుగు శాతానికి పైగా నష్టపోయింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,412.17 కోట్లు నష్టపోయి రూ.6,65,432.34 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.12,964.55 కోట్లు కోల్పోయి రూ.5,10,759.01 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,744.34 కోట్ల పతనంతో రూ.6,20,893.53 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.6,484.52 కోట్ల నష్టంతో రూ.5,52,680.92 కోట్లతో సరిపెట్టుకున్నది.
బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.1,266.37 కోట్ల నష్టంతో రూ.4,52,773 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.267.74 కోట్ల పతనంతో రూ.5,33,781.04 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్ యూఎల్) ఎం-క్యాప్ రూ.2,913.49 కోట్లు పెరిగి రూ.5,83,239.04 కోట్లకు పెరిగింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.1,024.53 కోట్ల లబ్ధితో రూ.13,18,228.14 కోట్ల వద్ద స్థిర పడింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.