HDFC Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు అలర్ట్ ప్రకటించింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ నెల 13న బ్యాంకింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ ప్రక్రియ చేపట్టింది. వచ్చే శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఈ అప్ గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాంక్ సిస్టమ్ అప్ గ్రేడ్ సమయంలో ఖాతాదారులకు కొన్ని సేవలు అందుబాటులో ఉండబోవని తెలిపింది.
సుమారు 13.30 గంటల పాటు సాగే అప్ గ్రేడ్ ప్రక్రియ సమయంలో బ్యాంకింగ్, పేమెంట్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. కనుక ఖాతాదారులు అసౌకర్యానికి గురి కాకుండా ఈ నెల 12నే తగిన మొత్తం నగదు విత్ డ్రా చేసుకోవాలని, పేమెంట్స్ చేయాల్సి ఉంటే.. ముందుగానే చెల్లించాలని సూచించింది. ఖాతాదారులపై ప్రభావం తగ్గించడానికి సెలవు నాడు అప్ గ్రేడ్ ప్రక్రియ చేపడుతున్నందున అందరూ సహకరించాలని కోరింది.
బ్యాంకింగ్ అప్ గ్రేడ్ ప్రక్రియలో భాగంగా 13 ఉదయం మూడు గంటల నుంచి 3.45 గంటల వరకూ, ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకూ యూపీఐ సేవలు ఉండవని, నెట్ బ్యాంకింగ్ సేవలూ పాక్షికంగానే లభిస్తాయని తెలిపింది. అలాగే ఏటీఎం లేదా డెబిట్ కార్డులకు సంబంధించి సెలెక్టెడ్ సర్వీసులు కొంత కాలం అందుబాటులో ఉండవని, అయితే, క్రెడిట్ కార్డు సేవలు యధాతథంగా కొనసాగుతాయని వివరించింది.
Vivo | వివో నుంచి మరో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
New EV Policy | కొత్త ఈవీ పాలసీ’లో మార్పులు.. దేశీయ కంపెనీలకే బెనిఫిట్లు.. ఎందుకంటే..?!
Tomato | మండే బ్లూస్ మాదిరిగా టమాటా కష్టాలు.. సెంచరీకి చేరువలో కిలో..!