Lok Sabha: లోక్‌సభలో చైర్‌పై పేపర్లు విసిరేసిన 8 మంది ఎంపీల సస్పెన్షన్
Lok Sabha : లోక్‌సభలో ఇవాళ 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి చైర్‌పై విసిరేసిన ఘటనలో ఈ చర్య తీసుకున్నారు. చైర్లో దిలీప్ సైకియా ఉన్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు తమకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పేపర్లను చింపి విసిరేశారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ(Lok Sabha)లో ఇవాళ 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి చైర్‌పై విసిరేసిన ఘటనలో ఈ చర్య తీసుకున్నారు. చైర్లో దిలీప్ సైకియా ఉన్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు తమకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పేపర్లను చింపి విసిరేశారు. సస్పెండ్ అయిన వారిలో మానికం ఠాగూర్, గురీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరణ్ రెడ్డి, వెంకట్ రామన్ ఉన్నారు. చైర్‌పై పేపర్లు విసిరేయడాన్ని స్పీకర్ ఖండించారు. పార్లమెంటరీ హుందాతనాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. బడ్జెట్ సెషన్లో ఇలాంటి ఘటనలను ఉపేక్షించలేమన్నారు. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు.
పార్లమెంట్లో సమస్యలను లేవనెత్తే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, సభ అందరిదని, చర్చలు జరగాలని, కానీ సభా వ్యవహారాలను అడ్డుకోవడం సరికాదు అని, నిరసన పేరుతో సభా నిర్వహణను స్తంభింపచేయడం కుదరదని దిలీప్ సైకియా అన్నారు. ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తప్పుపట్టారు. ప్రతి సభ్యుడిని మాట్లాడే హక్కు ఉందని, వారి ఆందోళనలను వినిపించుకోవాలని ఆమె అన్నారు. ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

