Dacoit Movie | ‘ధురంధర్ 2’ ఎఫెక్ట్.. వాయిదా దిశగా అడివి శేష్ ‘డెకాయిట్’?
Dacoit Movie | టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’.
Dacoit Movie | టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రం తాజాగా వాయిదా పడనుందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవానికి ఈ చిత్రాన్ని మార్చి 19న ఉగాది కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే అదే సమయంలో బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’తో పాటు కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొంది. ఈ భారీ చిత్రాల మధ్య థియేటర్ల లభ్యత, కలెక్షన్ల పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ‘డెకాయిట్’ చిత్రాన్ని ఏప్రిల్ 10, 2026కి వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. గతంలో ఈ బాక్సాఫీస్ క్లాష్ గురించి అడివి శేష్ స్పందిస్తూ తమ సినిమా పెద్ద చేపల మధ్య ఒక ‘గోల్డ్ ఫిష్’ లాంటిదని ధీమా వ్యక్తం చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సోలో రిలీజ్ కోసం వెతకడమే శ్రేయస్కరమని టీమ్ భావిస్తోంది. షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ సినిమా విడుదల తేదీపై అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

