న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.10,055.20 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని ఆర్జించింది. రుణాలకు డిమాండ్ నెలకొనడం, మొండి బకాయిల కోసం నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడంతో ఒక త్రైమాసికంలో 10 వేల కోట్ల కంటే అధిక లాభాన్ని ఆర్జించడం ఇదే తొలిసారి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.8,186.51 కోట్ల లాభాన్ని గడించింది. గత త్రైమాసికంలో పన్నుల కోసం రూ.2,989.50 కోట్ల నిధులను వెచ్చించినప్పటికీ రూ.10 వేల కోట్ల కంటే అధికంగా లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8 శాతం అధికమై రూ.41,085.78 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది రూ.38,017.50 కోట్లుగా ఉన్నది.
ఆర్థిక ఫలితాల్లో ముఖ్యాంశాలు..