HDFC Bank Q1 Results | క్యూ1లో 21 శాతం పెరిగిన ప్రాఫిట్
ముంబై, జూలై 16: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సమీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 21 శాతం ఎగబాకి రూ.9,579 కోట్లకు చేరుకున్నది. ఏకీకృత విషయానికి వస్తే ఏడాది క్రితం నమోదైన రూ.7,729.64 కోట్లతో పోలిస్తే 20 శాతానికి పైగా అధికమై రూ.9,159.99 కోట్లుగా నమోదైంది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో నమోదైన రూ.10,055 కోట్లతో పోలిస్తే మాత్రం తగ్గింది. సమీక్షకాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 14.5 శాతం అధికమై రూ.17 వేల కోట్ల నుంచి రూ.19,481 కోట్లకు చేరుకున్నది. నికర వడ్డీ మార్జిన్ 4 శాతంగా నమోదైంది.