న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దూసుకుపోతున్నది. దేశవ్యాప్తంగా గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంక్ రూ.48 వేల కోట్ల గృహ రుణాలు మంజూరు చేసింది.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో మంజూరు చేసిన రుణాలతో పోలిస్తే 10.5 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా..తొలి త్రైమాసికం కంటే 14 శాతం అధికమని పేర్కొంది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌ను బ్యాంక్‌లో విలీనం చేసుకున్న తర్వాత తొలి త్రైమాసికంలోనే ఇంతటి భారీ స్థాయిలో రుణాలు ఇవ్వడం విశేషం. అలాగే రిటైల్ రుణాల్లో వృద్ధి 85 శాతం నమోదైంది. జూన్ 30, 2023 నాటికి బ్యాంక్ స్థూల అడ్వాన్స్‌లు రూ.1.1 లక్షల కోట్లు పెరిగి రూ.23.5 లక్షల కోట్లకు చేరుకోగా, డిపాజిట్లు రూ.1.1 లక్షల కోట్లు ఎగబాకి రూ.21.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి.