HCLTech | ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) హైదరాబాద్‌లోని తన గ్లోబల్ డెలివరీ ఫుట్ ప్రింట్ (Global Delivery Foot Print)ను విస్తరిస్తున్నట్లు తెలిపింది. హైటెక్ సిటీలో 5000 మంది ఉద్యోగులు పని చేయగల సామర్థ్యం గల కొత్త సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. హైటెక్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్సియల్ సర్వీసెస్కతీతంగా ప్రపంచవ్యాప్తంగా పలు పారిశ్రామిక క్లయింట్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్పర్మేషన్ సొల్యూషన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ అందించడానికి ఈ కొత్త సెంటర్ ఉపకరిస్తుంది. హైటెక్ సిటీలో 3.20లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ న్యూ సెంటర్ ప్రారంభించింది. సుస్థిర వ్యాపార పద్దతులకు కట్టుబడి సేవలందిస్తున్నట్లు తెలిపింది.
‘అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులు, అత్యంత నాణ్యతతో కూడిన ప్రతిభావంతులకు వేదిక హైదరాబాద్. లోకల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌కు అనుగుణంగా గ్లోబల్ క్లయింట్ బేస్‌కు సేవలందు అందుబాటులోకి తెస్తుందీ న్యూ సెంటర్’ అని హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ సీ విజయ్ కుమార్ తెలిపారు. 2007 నుంచి హెచ్‌సీఎల్ టెక్నాలజీ హైదరాబాద్‌లో సేవలందిస్తున్నది. కొత్త సెంటర్‌తోపాటు 8,500 మంది కూర్చుని పని చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఉస్మానియా యూనివర్సిటీల నుంచి వచ్చే ప్రతిభావంతులను నియమించుకుంటూ ఐటీ సేవలందిస్తోంది హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.