న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశీయ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ మరోసారి తన సత్తాను చాటింది. దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీల్లో హెచ్సీఎల్ తొలి స్థానంలో నిలిచిందని టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచ అత్యుత్తమ కంపెనీలు 2024’ జాబితాలో వెల్లడించింది. నోయిడా కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న ఈ సంస్థ వృత్తిపరమైన సేవలు అందించే అంతర్జాతీయ టాప్-10 జాబితాలో కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
అంతర్జాతీయంగా కంపెనీల పనితీరు, ఉద్యోగుల సంతృప్తి, ఆదాయ వృద్ధి, స్థిరత్వం ఆధారంగా టైమ్స్ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ రూ.28 వేల కోట్ల ఆదాయంపై రూ.4,257 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ప్రస్తుతం సంస్థలో 2.19 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.