Harley-Davidson X440 | హార్లీ-డేవిడ్సన్ తొలిసారి.. ‘మేడ్ ఇన్ ఇండియా’ బైక్ ‘హార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440)’ బైక్ మార్కెట్లోకి తేనున్నది. హీరో మోటోకార్ప్స్ పార్టనర్ షిప్‌తో డెవలప్ చేసిన ‘హార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440)` బైక్ ఈ నెల నాలుగో తేదీన మార్కెట్లోకి తెస్తున్నది. అమెరికా మోటార్ బైక్‌ల తయారీ సంస్థ హార్లీ-డేవిడ్సన్, హీరో మోటో కార్ప్ సంస్థల మధ్య 2021లో భాగస్వామ్యం ఏర్పడింది. భారత్ నుంచే హార్లీ-డేవిడ్సన్ ఎక్స్ 440 (Harley-Davidson X440) బైక్ పలు దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఈ మోటార్ బైక్ ధర రూ.2.7 లక్షలు ఉండొచ్చునని అంచనా.
న్యూ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్ స్క్వారిష్ ప్యుయల్ ట్యాంక్, రౌండ్ హెడ్ లైట్, హెడ్ లైట్ మీద రౌండ్ స్పీడో మీటర్, వైడ్ హ్యాండిల్ బార్ విత్ ఇండికేటర్స్, మిర్రర్స్ ఉంటాయి. రింగ్ షేప్డ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ విత్ హార్లీ డేవిడ్సన్ రిటెన్ హెడ్ లైట్ అందిస్తారు. సర్క్యులర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో నెగెటివ్ ఎల్సీడీ యూనిట్ కూడా ఉంటుంది.
హార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 బైక్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్ విత్ డిస్క్ బ్రేక్ @ ఫ్రంట్ అండ్ రేర్ కలిగి ఉంటుంది. ప్రీ లోడెడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఫ్రంట్ వీల్ 18 అంగుళాలు, రేర్ వీల్ 17 అంగుళాలు ఉంటుంది. నేవిగేషన్ కోసం టీఎఫ్టీ యూనిట్, బ్లూటూత్ కనెక్టివిటీతోపాటు కాల్ అండ్ మెసేజ్ మేనేజ్మెంట్ ఫీచర్ కూడా ఉంటది.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 (Harley-Davidson X440) బైక్ 440సీసీ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్, ట్యూన్డ్ విత్ 6-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 30 బీహెచ్పీ విద్యుత్, 40 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.