Harley-Davidson X440 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ తన ఎక్స్440 మోడల్ మోటారు సైకిల్ శ్రేణిని విస్తరిస్తోంది. తాజా మూడు రంగుల్లో హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ ఆవిష్కరించింది. మొత్తం ఏడు ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. మిడ్ స్పెక్ ఎక్స్440 మోటారు సైకిల్ కు వివిద్ అనే పేరు పెట్టింది హార్లీ డేవిడ్సన్. ఇది మస్టర్డ్, గోల్డ్ ఫిష్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. స్టాండర్డ్ 3డీ లోగో వస్తున్న హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ ధర రూ.2.60 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ 440సీసీ ఎయిర్ / ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 27 హెచ్పీ విద్యుత్, 38 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్పర్ క్లచ్ తోపాటు 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. డ్యుయల్ చానెల్ ఏబీఎస్ తోపాటు ఇరువైపులా సింగిల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. దీంతోపాటు హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 ఎస్ వేరియంట్ బాజా ఆరేంజ్ రంగులో లభిస్తుంది. దీని ధర రూ.2.80 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని తెలిపింది.