హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఏసీలు, గృహోపకరణాల తయారీలో అగ్రగామి జపాన్‌కు చెందిన హైకావా అప్లయెన్సెస్..తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఎయిర్కాన్ ఇండియాకు చెందిన ఎక్స్పర్ట్ ఏసీ సొల్యుషన్స్‌తో చేతులు కలిపింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా హైకావాకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో ఎక్స్పర్ట్ ఏసీ సొల్యుషన్స్ విక్రయించనున్నది. ఈ సందర్భం నేషనల్ ఎయిర్ కాన్ ఎండీ షాముద్దీన్ మాట్లాడుతూ..వచ్చే ఐదేండ్లలో ఈ ఐదు రాష్ర్టాల్లో 150 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు, తద్వారా 500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలనుకుంటున్నట్లు చెప్పారు.