హైదరాబాద్, నవంబర్ 6: హిందుజా గ్రూపునకు చెందిన గల్ఫ్ ఆయిల్ లుబ్రికెంట్స్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూ డు నెలల కాలానికిగాను సంస్థ రూ.84.44 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.73.66 కోట్ల లాభంతో పోలిస్తే 15 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.86 శాతం ఎగబాకి రూ.802.30 కోట్ల నుంచి రూ.849.33 కోట్లకు చేరుకున్నది.
అపోలో హాస్పిటల్స్ ఆకర్షణీయం
హైదరాబాద్, నవంబర్ 6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.379 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అపోలో హాస్పిటల్స్. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.233 కోట్ల లాభంతో పోలిస్తే 63 శాతం వృద్ధిని కనబరిచింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపది కన 15 శాతం ఎగబాకి రూ.5,589 కోట్లకు చేరుకున్నది.