న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రూ.2 వేల కంటే అధికంగా జరిపే యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనేది తమ వద్దలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. రెండు వేల రూపాయల కంటే అధిక లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారని వస్తున్న వార్తను ఖండించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఈ వార్తలు అబద్దమని, తప్పుదారి పట్టించేది, ఎటువంటి ఆధారం లేనవని తెలిపింది.
ప్రసుత్తం ఇలాంటి ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయని, 2019-20లో రూ.21.3 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీలు..మార్చి 2025 నాటికి రూ.260.56 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.