ఎటూ తేలని నిర్ణయం
రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపుపై ఇంకా ఏ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. గురువారంతో రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం చేస్తున్న చెల్లింపుల కాలవ్యవధి తీరిపోతున్నది. 2017 జూలై 1న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 17 పన్నులను ఏకం చేస్తూ మోదీ సర్కారు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను దేశంలో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
- రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపుపై పట్టించుకోని కేంద్రం.. ముగిసిన కౌన్సిల్ భేటీ
చండీగఢ్, జూన్ 29: రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపుపై ఇంకా ఏ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. గురువారంతో రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం చేస్తున్న చెల్లింపుల కాలవ్యవధి తీరిపోతున్నది. 2017 జూలై 1న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 17 పన్నులను ఏకం చేస్తూ మోదీ సర్కారు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను దేశంలో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ర్టాలకు వాటిల్లే నష్టాలకుగాను ఐదేండ్లపాటు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన సంగతీ విదితమే. అయితే ఈ గడువు ఈ నెల 30తో ముగిసిపోతున్నది. దీంతో పరిహారాన్ని పొడిగించాలని దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయినప్పటికీ బుధవారం ముగిసిన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో ఇందుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదు. పార్టీలకతీతంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. నిజానికి కరోనా ప్రభావంతో రాష్ర్టాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని, జీఎస్టీ పరిహారాన్ని మరికొన్నేండ్లు ఇవ్వాలని రాష్ర్టాలు ఎప్పట్నుంచో కోరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ర్టాల ఆర్థిక వృద్ధికి జీఎస్టీ పరిహారం పొడిగింపు ఎంతో దోహదపడుతుందని రాష్ర్టాలు అంటున్నాయి.
క్యాసినో, లాటరీలపై..
క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, లాటరీలపై పన్ను నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తాజా భేటీలో వాయిదా వేసింది. వీటిపై గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీని వేయాలని భావిస్తున్నారు.
ఇది.. ‘ఇండ్లను కూలదోసే పన్ను’: రాహుల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జీఎస్టీని అభివర్ణిస్తూ ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’.. ఇప్పుడు ‘గ్రహస్తి సర్వనాశ్ ట్యాక్స్’ (ఇండ్లను కూలదోసే పన్ను)గా మారుతున్నదంటూ దుయ్యబట్టారు. ఓవైపు ఆదాయం, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇలా పన్నుల భారాన్ని ప్రజలపై మోపడం దారుణమని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Casinos
- gst
- Rahul Gandhi
- tax
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

