జీఎస్టీ వసూళ్లు1.52 లక్షల కోట్లు
పండుగ సీజన్ కొనుగోళ్లతో అక్టోబర్ నెలలో జీఎస్టీ (గూడ్స్, సర్వీసెస్ టాక్స్) వసూళ్లు 16.6 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది అక్టోబర్లో రూ.1.30 లక్షల కోట్ల వసూళ్లు జరగ్గా, ఈ అక్టోబర్లో రూ.1.52 లక్షల కోట్లు నమోదయ్యాయి.
- అక్టోబర్లో 16.6 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, నవంబర్ 1 : పండుగ సీజన్ కొనుగోళ్లతో అక్టోబర్ నెలలో జీఎస్టీ (గూడ్స్, సర్వీసెస్ టాక్స్) వసూళ్లు 16.6 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది అక్టోబర్లో రూ.1.30 లక్షల కోట్ల వసూళ్లు జరగ్గా, ఈ అక్టోబర్లో రూ.1.52 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ వసూళ్లు రూ.1.48 లక్షల కోట్లు. 2022 ఏప్రిల్లో వసూలైన రూ.1.68 లక్షల కోట్ల రికార్డు తర్వాత అక్టోబర్ నెల వసూళ్లదే ద్వితీయస్థానమని మంగళవారం విడుదలైన అధికారిక ప్రకటన తెలిపింది. వివరాలు..
- 2022 అక్టోబర్లో రూ.1,51,718 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు జరిగాయి.
- ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.26,039 కోట్లుకాగా, స్టేట్ జీఎస్టీ రూ.33,396 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.81,778 కోట్లు, సెస్ రూ.10,505 కోట్ల చొప్పున వసూలయ్యాయి.
- రూ.1.40 లక్షల కోట్లకుపైగా జీఎస్టీ వసూళ్లు నమోదుకావడం వరుసగా ఇది 8వ నెల.
- 2022 సెప్టెంబర్లో ఈ-వే బిల్స్ జనరేషన్ జోరుగా పెరిగింది. ఆగస్టులో 7.7 కోట్ల ఈ-వే బిల్స్ జనరేట్కాగా, సెప్టెంబర్లో ఈ సంఖ్య 8.3 కోట్లకు చేరింది.
తెలంగాణలో వసూళ్లు రూ.4,284 కోట్లు
అక్టోబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో రూ.4,284 కోట్ల వస్తు సేవల పన్నుల వసూళ్లు జరిగాయి. నిరుడు అక్టోబర్లో నమోదైన రూ.3,854 కోట్ల కంటే 11 శాతం వృద్ధిచెందాయి. అలాగే 2022 సెప్టెంబర్లో జరిగిన రూ.3,915 కోట్లతో పోలిస్తే అక్టోబర్లో 9.40 శాతం పెరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- gst
- GST collection
- October
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

