GST Reforms | జీఎస్టీ సంస్కరణలు అమలు చేసినప్పటి నుంచి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)కి 3వేలకుపైగా జీఎస్టీ సంబంధిత ఫిర్యాదులు వచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం తెలిపారు. ఈ ఫిర్యాదులను సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్)కి పంపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు అందించకుండా ఉండేందుకు.. తప్పుదారి పట్టించే డిస్కౌంటింగ్ పద్ధతులతో వినియోగదారులను మోసగిస్తున్న సందర్భాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని నిధి ఖర్గే చెప్పారు. అనేక రంగాల్లో ఫిర్యాదుల స్పష్టమైన పిక్చర్‌ను పొందేందుకు.. మంత్రిత్వశాఖ ఏఐ, చాట్‌బాట్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను రిటైలర్లు వినియోగదారులకు పూర్తిగా అందించడం లేదని ఆందోళనల మధ్య ఫిర్యాదు విధానం తీసుకువచ్చామని.. దాంతో ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించింది.