Banks NPA | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల మొండి బకాయిలు రూ.3.16 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. గత సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకులు మంజూరు చేసిన రుణాల్లో మొండి బకాయిల వాటా 3.09 శాతం అని మంగళవారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాత పూర్వకంగా సమాధానమిస్తూ ఈ సంగతి తెలిపారు. 2024 సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.3,16,331 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల మొండి బకాయిలు రూ.1,34,339 కోట్లు అని తెలిపారు. మొండి బకాయిల్లో ప్రభుత్వ రంగాల వాటా 3.09 శాతం కాగా, ప్రైవేట్ బ్యాంకుల్లో 1.86 శాతం అని వివరించారు.