e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home Top Slides గోల్డ్‌ ఎక్సేంజ్‌కి గ్రీన్‌సిగ్నల్‌

గోల్డ్‌ ఎక్సేంజ్‌కి గ్రీన్‌సిగ్నల్‌

ముంబై, సెప్టెంబర్‌ 28: దేశంలో గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటుకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ పచ్చజెండా ఊపింది. పుత్తడి… ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ రూపంలో ట్రేడుకానున్నది. బంగారానికి ప్రాతినిథ్యం వహించే ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ను (ఈజీఆర్‌లు), బాండ్లు షేర్ల తరహా సెక్యూరిటీలుగా నోటిఫై చేయనున్నట్లు సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి తెలిపారు. ముంబైలో జరిగిన సెబీ బోర్డు సమావేశం అనంతరం త్యాగి మీడియాతో మాట్లాడుతూ.. ఇతర సెక్యూరిటీల్లాగానే ఈజీఆర్‌లు ట్రేడింగ్‌, క్లియరింగ్‌, సెటిల్‌మెంట్‌ ఫీచర్లను కలిగి ఉంటాయన్నారు. గుర్తింపు పొందిన ఏ స్టాక్‌ ఎక్స్చేంజైనా ప్రత్యేక విభాగంలో ఈజీఆర్‌ల ట్రేడింగ్‌ ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. త్యాగి ఇంకా ఏమన్నారంటే…

  • ట్రేడింగ్‌ కోసం ఈజీఆర్‌ల విభజన, ఈజీఆర్‌లను బంగారంగా మార్చడం వంటి నిర్ణయాలన్నీ సెబీ అనుమతితో ఎక్స్చేంజ్‌లు తీసుకుంటాయి.
  • గోల్డ్‌ ఎక్స్చేంజ్‌లు నిర్వహించే ఈజీఆర్‌ల ట్రేడింగ్‌, భౌతికంగా బంగారం డెలివరీ వంటి ప్రక్రియలతో దేశంలో పుత్తడికి జాతీయ మార్కెట్‌ ధర నిర్ణయం కానున్నది.
  • ఈజీఆర్‌ల అమ్మకాలు, కొనుగోళ్ల కారణంగా సమర్థవంతమైన, పారదర్శకమైన ధరను కనుగొనేందుకు వీలవుతుంది.
  • బంగారం పెట్టుబడుల్లో ద్రవ్యత, పుత్తడి నాణ్యతపై హామీ వంటివి ఇన్వెస్టర్లకు లభిస్తాయి.
  • ఎక్స్చేంజీల్లో జరిగే ఈజీఆర్‌ల ట్రేడ్స్‌ను క్లియరింగ్‌ కార్పొరేషన్‌ సెటిల్‌చేస్తుంది. ఈజీఆర్‌లు, నిధుల్ని కొనుగోలు, అమ్మకందార్లకు పరస్పరం బదిలీచేస్తుంది.
  • ఈజీఆర్‌లను ఎంతకాలమైనా ఇన్వెస్టర్లు అట్టిపెట్టుకోవచ్చు.
  • ఈజీఆర్‌లను సరెండర్‌ చేసి, అందుకు సమానమైన బంగారాన్ని వాల్ట్‌ మేనేజర్ల నుంచి ఇన్వెస్టర్లు పొందవచ్చు.
  • భారత్‌లో రిజిస్టార్‌ అయిన సంస్థనే వాల్ట్‌ మేనేజర్‌గా వ్యవహరించేందుకు అనుమతిస్తారు. అటువంటి సంస్థ కనీసం రూ.50 కోట్ల నికర విలువ కలిగివుండాలి.
  • ఈజీఆర్‌లను సృష్టించడానికి అవసరమైన బంగారాన్ని ఎక్స్చేంజ్‌లు వాల్ట్‌ మేనేజర్‌ వద్ద డిపాజిట్‌ చేస్తాయి. వాల్ట్‌ నిర్వహణా సంస్థల్ని సెబీ నియంత్రిస్తుంది.
  • బంగారాన్ని డిపాజిట్‌ చేసుకోవడం, దానిని స్టోర్‌ చేయడం, భద్రపర్చడంతో పాటు ఈజీఆర్‌ విత్‌డ్రాయిల్‌ వివాదాల పరిష్కారం, వాల్ట్‌లో ఉన్న బంగారాన్ని డిపాజిటరీ రికార్డులతో సరిచూసుకోవడం వాల్ట్‌ మేనేజర్‌ బాధ్యతలు.

సోషల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌కు ఓకే
సామాజిక సంస్థలు, ఎన్జీవోల నిధుల సమీకరణ కోసం ఏర్పాటు సోషల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటుచేసేందుకు నియమనిబంధనలు రూపొందించాలని బోర్డు నిర్ణయించినట్లు అజయ్‌ త్యాగి తెలిపారు. సామాజిక సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు (ఎన్‌పీవోలు) ఎన్జీవోల నిధుల సమీకరణ కోసం ఈ ఎక్స్చేంజ్‌ను ఉద్దేశించారు. అయితే సోషల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎస్‌ఎస్‌ఈ)ను ఎప్పటిలోగా ఏర్పాటుచేయాలనేది ఇంకా నిర్ణయించలేదని, దీనిపై ప్రభుత్వంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత స్టాక్‌ ఎక్స్చేంజీల్లో ఎస్‌ఎస్‌ఈలు ప్రత్యేక విభాగంగా ఉండనున్నాయి. ఈక్విటీ, బాండ్ల జారీ ద్వారా ఇవి నిధుల్ని సమీకరిస్తాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement