న్యూఢిల్లీ, జూన్ 20: ఎలక్ట్రిక్ ద్వి-చక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుండటంతో రూ.5,500 కోట్ల నిధులను సేకరించాలని సంస్థ సంకల్పించింది. దీంతోపాటు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఐపీవోకి కూడా అనుమతినిచ్చింది. ఈ రెండు సంస్థలు గతేడాది డిసెంబర్లోనే దరఖాస్తు చేసుకున్నాయి.