న్యూఢిల్లీ, జూన్ 11: ఓలా ఎలక్ట్రిక్..ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలిసారి స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ సంస్థ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో విక్రయించనుండటంతో రూ.5,500 కోట్ల నిధులు సేకరించాలనుకుంటున్నది.