హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్‌పవర్ రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకి సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. కర్నూల్ జిల్లాలో నెలకొల్పిన గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్‌ను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ వంటి మార్గాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ పలు దేశాలు ముందుకెళ్తున్నాయని, పగలు సోలార్ విద్యుత్తును స్టోరేజ్ చేసి, రాత్రివేళ పంప్డ్ స్టోరేజీ ద్వారా పీక్ అవర్స్‌లో విద్యుత్తు ఉత్పత్తి చేసే యూనిట్‌ను పరిశీలించామన్నారు.