పర్యావరణ ప్రయోజనాలతో ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ నిమిత్తం జారీచేసే బాండ్లే గ్రీన్ బాండ్లు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, ఇతర సంస్థలు సౌరశక్తి, పవనశక్తి ప్రాజెక్టుల కోసం, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్, గ్రీన్ బిల్డింగ్ల వంటి నిర్మాణాలకు నిధుల కోసం గ్రీన్ బాండ్లను జారీ చేస్తున్నాయి. ఇక గ్రీన్ బాండ్లు సాధారణంగా మదుపరులకు స్థిరమైన వడ్డీని అందించే ఆర్థిక సాధానాలు. అయినా సంస్థాగత మదుపరులూ ఆసక్తి చూపుతున్నారు.