Gravton Quanta | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ గ్రావ్టోన్ మోటార్.. భారత్ మార్కెట్లోకి క్వాంటా ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ (Quanta Electric Motor Cycle) ఆవిష్కరించింది. లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్పేట్ (Lithium Manganese Iron Phosphate- LMFP) బ్యాటరీతో వస్తున్న తొలి మోటారు సైకిల్ ఇది. గ్రావ్టోన్ క్వాంటా మోటారు సైకిల్ రూ.1.2 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, ఎథేర్ 450ఎక్స్ వంటి ఈవీ మోటారు సైకిళ్లతో గ్రావ్టోన్ క్వాంటా ఈవీ మోటార్ సైకిల్ పోటీ పడుతుంది. ఈ మోటారు సైకిల్ లో 2.78 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఏకో మోడ్ లో 125 కి.మీ, స్పోర్ట్స్ మోడ్ లో 85 కి.మీ, పవర్ మోడ్ లో 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ 90 నిమిషాల్లో పూర్తిగా చార్జింగ్ అవుతుంది. గరిష్టంగా గంటకు 75 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.